బండలేమూరులో మెగా రక్తదాన శిబిరం
విశ్వంభర, బండలేమూరు : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటి అధ్యక్షులు చేపూరి శంకర్ ఆధ్వర్యంలో తలసేమియా బాధితుల కోసం బండలేమూరు గ్రామంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరాన్ని గౌరవ అతిధి 28 సార్లు రక్తదానం చేసిన వడ్డీ రత్నాకర్ రావు, గ్రామ సర్పంచ్ పాతులోతు శ్రీనివాస్ ప్రారంభించారు. రక్తదానం చెసిన యువకులను చేపూరి శంకర్ అభినందించి వారికీ ప్రశంస పత్రాలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రక్తదానం ప్రాణదానంతో సమానమని, ఇతర దానాల కంటే రక్త దానం గొప్పదని అన్నారు. రక్తదాతలే నిజమైన హీరోలు అని అన్నారు. అనేక రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేశామని అన్నారు. తలసేమియా బాధితుల కోసం రక్త దాన శిబిరాలు ఏర్పాటు చేసి రక్తం సేకరించి రెడ్ క్రాస్ సొసైటీకి అందజేస్తున్నామని అన్నారు.. దేశంలో రోజుకు 12 వేల మంది తలసేమియా బాధితులు మరణిస్తున్నారని..వారి ప్రాణాలు కాపాడడానికి యువత ముందుకు వచ్చి రక్త దానం చేయాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బూడిద రమేష్. రెడ్ క్రాస్ డాక్టర్ రామ సుబ్బారెడ్డి రత్న మేడo వార్డ్ నెంబర్లు లొంగారి మల్లేష్, పాతులోత్మోహన్. సభావాట్. చందు మాజీ సర్పంచ్ మంగ శ్రీనివాస్. రంగారెడ్డి జిల్లా రిపోర్టర్ మాజీ వార్డ్ నెంబర్ జోగు శ్రీనివాస్. మాజీ వార్డ్ నెంబర్ రామావత్ జనార్ధన్. నాతి.జగదీష్. జోగు లింగస్వామి. జోగు సుదర్శన్. జోగు చిరంజీవి లొంగరి పద్మ జోగు ప్రవీణ్ దుబ్బాక బన్నీ. బన్నీ. మహేష్. జోగు రాకేష్. సందీప్ మక్బుల్ తదితరులు పాల్గొన్నారు.



