నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ పట్టివేత
On
విశ్వంభర, జిహెచ్ఎంసి : గోవా, ఢిల్లీ ప్రాంతాల నుంచి ఎయిర్పోర్ట్ ద్వారా మద్యం వస్తుందని సమాచారం మేరకు ఎస్టిఎఫ్ బి టీం అండ్ డి టీం సిబ్బంది కలిసి మంగళవారం తెల్లవారుజామున పహాడ్ షరీఫ్ వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీ లో నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ 71 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పట్టుకున్న మద్యం విలువ సుమారు రూ.1.4 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. పట్టుకున్న మద్యాన్ని ఎక్సైజ్ మీర్పేట్ స్టేషన్లో అప్పగించినట్లు డి టీం సీఐ నాగరాజు, బి టీం ఎస్ ఐ బాలరాజులు తెలిపారు.



