వైశ్యరాజు జువెలర్స్ కు విచ్చేసిన శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి

వైశ్యరాజు జువెలర్స్ కు విచ్చేసిన శ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి

విశ్వంభర, హైదరాబాద్ :- వైశ్యరాజు జువెలర్స్ ఫిబ్రవరి 22 ఆదివారం నాడు ఘనంగా చైతన్యపురి లో ప్రారంభించనున్నారు. శుక్రవారం నాడు వైశ్యరాజు జువెలర్స్ లో  జరిగిన పూజ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన జీయర్ స్వామి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి వైశ్యరాజు జువెలర్స్ యాజమాన్యానికి వారి కుటుంబ సభ్యులకు చిన జీయర్ స్వామి వారు ఆశీర్వాదాలు అందజేశారు. ముందుగా వారికి పూర్ణకుంభం తో పండితుల వేద మంత్రాల మధ్య ఘన స్వాగతం పలికారు.  ఈ కార్యక్రమానికి విచ్చేసిన వారు జువెలర్స్ వ్యాపార రంగము మంచి స్థాయికి చేరుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  వైశ్యరాజు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags: