ఘనంగా వీడ్కోలు సమావేశం 

ఘనంగా వీడ్కోలు సమావేశం 

విశ్వంభర, నాగారం: నాగారం మండల పరిధిలోని పసునూరులో గల మోడల్ స్కూల్లో శనివారం  ఇంటర్మీడియట్ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం  ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకకు స్థానిక నాగారం మండలం ఎస్సై చిరంజీవి హాజరైనారు. ఈ సందర్భంగా ఎస్ఐ గారు మాట్లాడుతూ , విద్యార్థులు క్రమశిక్షణ తో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పారు. విద్యార్థులు చదువుతోపాటు అన్ని రంగాలలో ముందుండాలన్నారు. ఈ సందర్భంగా మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ బల్గూరి చంద్రబాబు మాట్లాడుతూ,  విద్యార్థులు విద్యార్థి దశలోనే ఉన్నత లక్ష్యాలని ఎంపిక చేసుకుని వాటిని సాధించడానికి నిరంతరం కృషి చేయాలన్నారు.  ఈ కార్యక్రమంలో అధ్యాపకులు బాలరాజు, సోమసుందర్, రవి, లింగరాజు, కృష్ణ, నాగరాజు, వీరన్న, అశోక్, లింగయ్య,  మహేష్, కలింగయ్య, పిడి మహేష్,శ్రావణ్ వెంకన్న  నరేష్ సాయిరాం సాధన రాధా విజయలక్ష్మి హసీనా సుమారాణి  వెంకటరమణ  విద్యార్థిని విద్యార్థులు  పాల్గొన్నారు.

Tags: