సైబర్ నేరాలపై అవగాహన
విశ్వంభర,మహబూబాబాద్: కురవి పోలీస్ స్టేషన్ పరిధిలోని గుండ్రాతిమడుగు జడ్పీ హెచ్ఎస్ హైస్కూల్ విద్యార్థులకు జిల్లా ఎస్పీ డా.శబరీష్ ఆదేశాల మేరకు పోక్సో చట్టం, మహిళలు ,పిల్లలపై జరిగే నేరాలపై షీ టీం శుక్రవారం అవగాహన కల్పించింది. షీ టీం ఎస్సై సునంద మాట్లాడుతూ మహిళల రక్షణకు షీ టీం పనిచేస్తుందని అన్నారు. మహిళలు, పిల్లలతో అసభ్యకరంగా ప్రవర్తించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటుందన్నారు. ర్యాగింగ్,కామెంట్ చేయడం, రాంగ్ కాల్ చేయడం, రాంగ్ మెసేజ్ చేయడం, మిస్ బిహేవ్ చేయడం, సామజిక మధ్యమాలలో ఏ విధమైన ఇబ్బందులకు గురిచేసిన సంబంధిత వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరైనా ఏ విదంగా అయినా ఇబ్బంది పెట్టినా షీ టీమ్ ను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎం కె. జానయ్య,షీ టీమ్ హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, అరుణ పార్వతి రమేష్ ,యూనిట్ ఉమెన్ కానిస్టేబుల్ సుప్రజ, భరోసా సిబ్బంది జ్యోత్స్న, రేణుక విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.



