పుత్రోత్సాహంలో ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత

గ్రాడ్యుయేషన్ ప‌ట్టా అందుకున్న ఎమ్మెల్సీ క‌విత కుమారుడు ఆదిత్యా

పుత్రోత్సాహంలో ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత

విశ్వంభర , హైద‌రాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ పుత్రోత్స‌వం వ్య‌క్తప‌ర్చారు. ఎమ్మెల్సీ క‌విత పెద్ద కుమారుడు ఆదిత్యా అమెరికాలోని ఓక్ ఫారెస్ట్ యూనివ‌ర్సిటీ నుంచి గ్రాడ్యురేష‌న్ ప‌ట్టాను అందుకున్నారు.  యూనివ‌ర్సిటీలో జ‌రిగిన గ్రాడ్యుయేష‌న్ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్సీ క‌విత‌, అనీల్ కుమార్ దంప‌తులు హాజ‌ర‌య్యారు.

గ్రాడ్యురేష‌న్ కు సంబంధించిన ఫోటోను సామాజిక మాధ్య‌మాల్లో షేర్ చేసి ఎమ్మెల్సీ క‌విత త‌న ఆనందాన్ని వ్య‌క్తం చేశారు. "ఆదిత్యా, నీ చిట్టి చేతిని పట్టుకోవడం నుండి నువ్వు డిగ్రీ పట్టుకోవడం వరకు చూశాను. ఎంత గొప్ప ప్రయాణం అది. నువ్వు చాలా క‌ష్ట‌ప‌డ్డావు. ఎంతో ఎదిగావు. మేమంద‌రం గ‌ర్వ‌ప‌డేలా చేశావు"  అని ఎక్స్ లో పేర్కొన్నారు. ఒక త‌ల్లిగా ఎంతో గ‌ర్వ‌ప‌డుతున్నానని సంతోషం వ్య‌క్తం చేశారు.

Read More సప్త మాతృకలకు, సప్త బంగారు బోనం సమర్పణకు వివిధ ప్రముఖులకు ఆహ్వానం

కాగా, ఈ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి ఏడు రోజుల పాటు అమెరికా పర్యటనకు ఢిల్లీలోని సిబిఐ ప్రత్యేక కోర్టు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నెల 23వ తేదీన ఎమ్మెల్సీ కవిత తిరిగి హైదరాబాద్ చేరుకొనున్నారుWhatsApp Image 2025-05-20 at 11.52.46 AM