మునగాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ e
- - ప్రజలకు అందుబాటులో పోలీస్, బాధితులకు బరోసా
- జాతీయ రహదారిపై రాత్రింబవళ్ళు పోలీస్ పెట్రోలింగ్
- రహదారి భద్రత కు, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
విశ్వంభర, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహా మంగళవారం ఉదయం మునగాల పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీ లో భాగంగా పోలీస్ స్టేషన్ నందు నిర్వహిస్తున్న రిసెప్షన్ సెంటర్ ను తనిఖీ చేసి ఫిర్యాదుల నిర్వహణ, ఫిర్యాదులపై పోలీసు సేవలు, బాధితులతో పోలీసు వ్యవహరించి తీరు, రికార్డ్ నమోదు మొదలగు అంశాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి బాధితునికి భరోసా కల్పించే విధంగా రిసెప్షన్ సెంటర్ సిబ్బంది పనిచేయాలని ఆదేశించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలు, వివిధ కేసుల్లో స్వాధీనం చేసుకున్న వాహనాలను పరిశీలించారు. స్టేషన్ రికార్డ్స్, కేసుల స్థితిగతులు, సాంకేతికత సద్వినియోగం, సీసీ కెమెరాలు నిర్వహణ, సమస్యాత్మక వ్యక్తుల రికార్డుల నిర్వహణ ను క్షుణ్ణంగా తనిఖీ చేసి సిబ్బందికి సలహాలు సూచనలు అందించారు. సిబ్బంది పనితీరు, సేవల్లో సామర్థ్యం అంశాలను తనిఖీ చేశారు. జాతీయ రహదారి వెంట నిరంతరం గస్తీ నిర్వహిస్తూ రోడ్డు ప్రమాదాల నిర్మూలనకు పోలీసు సిబ్బంది నిరంతరం కృషి చేయాలని సూచించారు. పోలీసు సేవలో పనితీరును ప్రతి సిబ్బంది మెరుగుపరుచుకుని ఆధునిక పోలీస్ అనుసరిస్తూ ప్రజలకు సేవలు అందించాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ శాఖ ఎల్లప్పుడు అందుబాటులో ఉంటుందని, ఫిర్యాదులపై వేగంగా స్పందిస్తూ బాధితులకు భరోసా కల్పిస్తున్నామని అన్నారు. జాతీయ రహదారిపై రాత్రింబవళ్లు పోలీస్ శాఖ పెట్రోలింగ్ నిర్వహిస్తుందని రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించే వ్యక్తులపై కఠినంగా వ్యవహరిస్తామని చట్ట ఉల్లంఘన చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపడం జరుగుతుందని హెచ్చరించారు. అక్రమ రవాణా అసాంఘిక కార్యకలాపాలపై పోలీస్ శాఖ పూర్తిస్థాయి నిగా వచ్చిందని వీటికి పాల్పడే వారిని ఉపేక్షించమని అన్నారు. ఎస్పీ వెంట మునగాల సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణా రెడ్డి, ఎ ఎస్ ఐ రత్నం, పోలీసు సిబ్బంది ఉన్నారు.