పేరుమండ్లగూడెం సర్పంచ్ దూపెల్లి రాకేష్ ప్రమాణస్వీకారంలో - ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు
విశ్వంభర, హన్మకొండ జిల్లా:- ఐనవోలు మండల పరిధిలోని పేరుమండ్లగూడెం గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఎన్నికైన దూపెల్లి రాకేష్ ఉప సర్పంచ్ అనిల్ వార్డు నెంబర్ల చేత అధికారులు ప్రమాణస్వీకారం చేయించే కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు పాల్గొని శాలువాతో సత్కరించి అభినందనలు శుభాకాంక్షలు తెలిపారు. తొలుత ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన ఎమ్మెల్యే నాగరాజు ని సత్కరించి ఘన స్వాగతం పలికిన గ్రామస్తులు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతు:గ్రామాభివృద్ధి, ప్రజాసేవే లక్ష్యంగా సర్పంచ్ రాకేష్ పనిచేయాలని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి చేరేలా కృషి చేయాలని సూచించారు. గ్రామంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, శుభ్రత, విద్య, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని ఆకాంక్షించారు. అలాగే ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేస్తే గ్రామం సమగ్రంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు...ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధికారులు తదితరులు పాల్గొన్నారు....



