సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే మురళి నాయక్ భూమి పూజ .

సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే మురళి నాయక్ భూమి పూజ .

విశ్వంభర, మహబూబాబాద్:   మండలం  సోమలతండ గ్రామపంచాయతీలో  33/ 11 కెవి  నూతన సబ్ స్టేషన్ కొరకు ఎమ్మెల్యే మురళి నాయక్ భూమి పూజ  ఎమ్మెల్యే చేసారు.  ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ మాట్లాడుతూ సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు రెండు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని , వీలైనంతవరకి సబ్ స్టేషన్ ఆరు నెలల లోపు పూర్తిచేయాలని సంబంధిత అధికారులను కోరారు . అంతేగాకుండా గత పాలకులు  రాష్ట్ర ప్రజలకు ,  మహబూబాబాద్ నియోజకవర్గ ప్రజలకు టిఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేసింది శూన్యమని గుర్తు చేశారు .  మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో ఏర్పడిన అప్పటినుంచి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటూ  వస్తున్నామని  ఆయన అన్నారు . గత పాలకులు చేసిన అవినీతి ఎక్కడ మన కాంగ్రెస్ ప్రభుత్వం బయటపే డుతుందని భయపడి ఇష్టం వచ్చినట్లుగా  కాంగ్రెస్  పార్టీ ప్రభుత్వం పైన బురద చల్లుతున్నారని , రానున్న అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ  పూర్తి స్థాయిలో ఖాళీ అవుతుందని , ఆయన అన్నారు . ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ జిల్లా అధికారీ , విద్యుత్ శాఖ డి ఈ లు ,  పర్వతగిరి , సోమల తండా , లక్ష్మ తండా,  గ్రామపంచాయతీల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు , సంబంధిత అధికారులు ,  గ్రామస్తులు ,  కాంగ్రెస్ పార్టీ నాయకులు , మాజీ ప్రజాప్రతినిధులు ,  రైతులు ,  భారీ సంఖ్యలో పాల్గొన్నారు

Tags:  

Advertisement

LatestNews

సబ్ స్టేషన్ నిర్మాణానికి ఎమ్మెల్యే మురళి నాయక్ భూమి పూజ .
జూన్ 2 నాటికి జ‌ర్న‌లిస్ట్‌ల ఇళ్ల స్ధ‌లాల స‌మస్యకు ప‌రిష్కారం : మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస‌రెడ్డి
కార్మికుల సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది : టీజీఐఐసి చైర్ పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి
డాక్టర్ చిలుకు స్వామికి శ్రమశక్తి అవార్డు..
సంగారెడ్డి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల అభివృద్ధికి మరోసారి ముందుకు వచ్చిన అరబిందో ఫార్మా
శ్రీ విద్యా వికాస్ హై స్కూల్ నూటికి నూరు శాతం ఫలితాలు
కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో పదవ తరగతి విద్యార్థుల ప్రతిభ