తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే జీఎంఆర్
On
విశ్వంభర, సంగారెడ్డి: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని పటాన్ చేరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి దర్శించుకున్నారు. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. అనంతరం తన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి, కుమారుడు గూడెం సంతోష్ రెడ్డి వివాహం సందర్భంగా స్వామి వారి ఆలయంలో తొలి వివాహ పత్రికను అందించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తిరుపతి వెంకన్న ఆశీస్సులతో పటాన్ చేరు ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యే జీఎంఆర్ వెంట ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, మాజీ ఎంపీటీసీ కొల్కురి రామచంద్రా రెడ్డి, గూడెం సందీప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



