గంధమల్ల వద్ద ప్రత్యేక పూజలు చేసిన  MLA  బీర్ల ఐలయ్య

గంధమల్ల వద్ద ప్రత్యేక పూజలు చేసిన  MLA  బీర్ల ఐలయ్య

 ఫలించిన ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ప్రయత్నం

జలకలను సంతరించుకున్న కాలువలు,చెరువులు,కుంటలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి కృతజ్ఞతలు తెలుపుతున్న ప్రజలు, రైతులు

విశ్వంభర, ఆత్మకూరు(ఎం) : యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం గంధమల్ల చెరువులోకి ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య  చొరవతో  చెరువు నిండి మత్తడీ దూకుతుండడంతో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య చెరువు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లన్నసాగర్ నుండి గంధమల్లకు నీటిని విడుదల చేయాలని ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆలేరు మార్కెట్ కమిటీ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావుని,కోమటిరెడ్డి వెంకటరెడ్డిని, ఎంపీ చామల కిరణ్ కుమార్ ని కోరగా,  కోరిన 10 గంటలల్లో నీటిని విడుదల చేసారు. దీంతో ఆలేరు నియోజకవర్గ ప్రజలు,రైతులు సంతోషం వ్యక్తం చేశారు. గంధమల్ల చెరువు నీండి మత్తడి పోస్తూ కింద ఉన్నటువంటి పలు గ్రామాల చెరువులు, కాలువలు, నిండి జలకళ ను సంతరించుకుంటున్నాయి. అంతముందుకు జగదేవ్ పూర్, మండలం గంధమల్ల సమీపంలో ఉన్నటువంటి మదన దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తెలంగాణ రాష్ట్రం ఆలేరు నియోజకవర్గం సస్యశ్యామలంగా ఉండాలని వేడుకున్నారు. ఈ సందర్భంగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తంకుమార్ రెడ్డికి,కోమటిరెడ్డి వెంకటరెడ్డికి,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకి,ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి ప్రజలు రైతులందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Tags: