చేనేత ఎక్స్పో ను ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు
On
విశ్వంభర, హైదరాబాద్ :- నారాయణగూడ పద్మశాలి భవన్ లో ఏర్పాటు చేసిన చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ముఖ్య అతిధిగా హాజరై ప్రారంభించారు. వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్, తెలంగాణ ప్రాంత పద్మశాలి మహిళా విభాగం సంయుక్తంగా చేపట్టిన ఈ ప్రదర్శనకు పద్మశాలి , చేనేత నాయకులు పాల్గొన్నారు.అలాగే వరంగల్ మేయర్ గుండు సుధా రాణి , చేనేత కార్పొరేషన్ వైస్ చైర్మన్ జక్కని అనిత హాజరయ్యారు. ఈ సందర్బంగా ఎక్స్పో నిర్వాహకులు మాట్లాడుతూ చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికులకు నిరంతరం ఉపాధిని కల్పించే దిశగా కృషి చేస్తున్నామని అన్నారు. ఈ వస్త్ర ప్రదర్శనలో నేరుగా చేనేత కార్మికుడి నుండి వినియోగదారులకు అందించే విధంగా అమ్మకాలు జరిగేటట్టు చేస్తున్నామని అన్నారు. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా మంచి నాణ్యమైన గల చీరలను వినియోగదారులకు అందించే విధంగా ఇలాంటి ప్రదర్శన చేపడుతున్నామని అన్నారు. దాదాపు 45 స్టాల్స్ పైగా ఏర్పాటు చేయడంతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక తమిళనాడు, కేరళ, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని గద్వాల, పోచంపల్లి, పుట్టపాక, సిరిసిల్ల, సిద్ధిపేట, వరంగల్, నారాయణపేట వంటి ప్రాంతాల నుండి చేనేత ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంటాయని అన్నారు. గత రెండు సం.రాలుగా చేపడుతున్న చేనేత వస్త్ర ప్రదర్శనకు మంచి పేరు రావడంతో పాటు మార్కెటింగ్ అలాగే మంచి ఆదాయం వ్యాపారస్తులకు రావడం చాల సంతోషముగా ఉందని అన్నారు. ఈ మూడవ సంవత్సరంలో కూడా చేనేత వస్త్ర ప్రదర్శన ను విజయవంతం చేయాలనీ కోరారు.ఈ కార్యక్రమంలో కందగట్ల స్వామి , పోరండ్ల శారదా, మాచర్ల రామచంద్రం, గుర్రం శ్రావణ్ నేత,చినకోట్ల స్వప్న రాజ్, కోశాధికారి నోముల రేఖ, అడెపు శాంతి, అర్చన, స్వరూప, విజయ్, కత్తులు సుదర్శన్, కర్నాటి విజయ్ నేత తదితరులు పాల్గొన్నారు.
🕒 17 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/minister-tummala-nageswara-rao-inaugurated-the-handloom-expo/article-18817