సీతక్కకు గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం వినతి పత్రం
విశ్వంభర, కేసముద్రం: డా. బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ , శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ (సీతక్క) ని తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ ఉద్యోగుల సమస్యలపై మంత్రితో చర్చించారు. ముఖ్యంగా, గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న కారోబార్, బిల్ కలెక్టర్లకు జీవో నెంబర్. 51 నుండి మినహాయింపు ఇవ్వాలని, అలాగే గ్రామపంచాయతీ ఉద్యోగులందరికీ ప్రతి నెలా 1వ తేదీన జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గ్రామపంచాయతీ ఉద్యోగులకు ప్రతి నెలా 1వ తేదీన జీతాలు చెల్లించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నాయకులు గుర్తుచేశారు. సీఎం ఆదేశాలు మరియు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమం పట్ల చూపుతున్న చిత్తశుద్ధిని సంఘం నాయకులు స్వాగతించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డికి, మంత్రి సీతక్కకి తెలంగాణ గ్రామపంచాయతీ ఉద్యోగుల సంఘం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి ని కలిసిన వారిలో సంఘం నాయకులు పిల్లి రవి యాదవ్, శ్రీధర్, సురేందర్, కందిపాటి నాగరాజు, కట్టయ్య, నేత నర్సయ్య, ఐలయ్య తదితరులు ఉన్నారు.