మెరిసిన బీసీ విద్యార్థులు.. గురుకులాలకు మంత్రి పొన్నం హామీ 

మెరిసిన బీసీ విద్యార్థులు.. గురుకులాలకు మంత్రి పొన్నం హామీ 

ఎంసెట్ ఫలితాల్లో బీసీ గురుకులాలు మంచి ఫలితాలు సాధించడంపై బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. బీసీ విద్యార్థులకు ఉన్నత విద్యను అందించే లక్ష్యంతోనే గురుకులాలు పనిచేస్తున్నాయని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులు ఇలా మంచి ఫలితాలు రాబడితే.. ప్రభుత్వం తరుఫు నుంచి మరింత సహకారం అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఎంసెట్ ఫలితాల్లో స్ఫూర్తి అనే బీసీ విద్యార్థిని 369వ ర్యాంక్ సాధించింది. దీనిపై పొన్నం ప్రభాకర్ ఆనందం వ్యక్తం చేశారు. సూర్తిని స్పూర్తిగా తీసుకొని మరింత మంది విద్యార్థులు కష్టపడాలని సూచించారు. 

Read More కేటీఆర్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వంశీకృష్ణ

 

స్పూర్తి మాత్రమే కాదు.. ఈ సారి ఎంసెట్ ఫలితాల్లో బీసీ గురుకుల విద్యార్థుల మంచి ఫలితాలు రాబట్టారు. అగ్రికల్చర్ విభాగంలో 145 మంది బాలికలు పరీక్ష రాయగా 114 మంది అర్హత సాధించారు. ఐదువేల లోపు ర్యాంకర్లు 12 మంది, పదివేల లోపు ర్యాంక్ లు 29 మంది బాలికలు ఉన్నారు. ఇక ఇంజనీరింగ్ విభాగంలో 276 మంది బాలికలు పరీక్ష రాయగా 191 మంది అర్హత సాధించారు. వారిలో ఇద్దరికి పదివేల లోపు ర్యాంక్స్ వచ్చాయి. ఇక 135 మంది బాలురు పరీక్ష రాయగా 107 మంది క్వాలిఫై అయ్యారు. వారిలో 5 మంది బాలురు పదివేల లోపు ర్యాంక్‌లు సాధించారు.  

 

వచ్చే ఏడాది మరిన్ని ర్యాంక్‌లు సాధించాలని విద్యార్థులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఉన్నత నాణ్యతా ప్రమాణాలతో విద్యను అందించడానికి ప్రభుత్వ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు. బీసీ విద్యార్థులు కష్టపడి మంచి స్థాయిలో ఉన్నపుడే మహ్మాతా జ్యోతి బా పూలే ఆకాంక్షలు నిజమవుతాయని ఆయన చెప్పారు.

Advertisement

LatestNews

ఇంటింటా జ్వర సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహించాలి
BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా వేముల నరేష్ కుటుంబానికి ₹1,50,000/- ఆర్థికసాయం అందజేసి, అండగా నిలిచిన - మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్
మహాలక్ష్మి అమ్మవారికి తొలి వన బోనం గొల్లలు సమర్పించిన గంగ పుత్రులు
కేంద్ర బడ్జెట్లో బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది..?
28 న ముఖ్యమంత్రి రేవంత్ పర్యటనపై కల్వకుర్తి ఎమ్మెల్యే సమీక్ష
రైతు వేదిక నందు రైతు బీమా కొరకు దరఖాస్తుల స్వీకరణ
డిగ్రీ ఫలితాల్లో శ్రీ వెంకటేశ్వర విద్యార్థుల హవా