కుబేర ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి గడ్డం వివేక్

కుబేర ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన మంత్రి గడ్డం వివేక్

విశ్వంభర/ బోడుప్పల్:గ్రేటర్ హైదరాబాద్ బోడుప్పల్ సర్కిల్ బొల్లిగూడెం ప్రధాన రహదారిలో నూతనంగా ఏర్పాటు చేసిన కుబేర్ ఫిల్లింగ్ స్టేషన్ను ఆదివారం కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి, డిసిసి అధ్యక్షులు వజ్రష్ యాదవ్ ముఖ్యఅతులుగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి వివేక్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది అన్నారు. చదువుకుంటున్న యువత స్వయం ఉపాధి పై శ్రద్ధ వహించాలని సూచించారు. కొత్తగా వ్యాపార సంస్థల ఏర్పాట్ల వల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. ముందుగా కుబేర్ ఫిల్లింగ్ స్టేషన్ యజమాన్యం 12వ డివిజన్ మాజీ కార్పొరేటర్ బొమ్మకు కళ్యాణ్ కుమార్, బొమ్మకు నిఖిల్ కు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు నాణ్యమైన పెట్రోలు, సేవలు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని ఫిల్లింగ్ స్టేషన్ నిర్వహకులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ కేంద్రమంత్రి సర్వే సత్యనారాయణ,బోడుప్పల్ పిజ్జాదిగూడ మాజీ మేయర్లు తోటకూర అజయ్ యాదవ్, అమర్ సింగ్, బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నరసింహారెడ్డి,మేడ్చల్ నియోజకవర్గం బి బ్లాక్ ప్రధాన కార్యదర్శి కొత్త కిషోర్ గౌడ్, మాజీ డిప్యూటీ మేయర్ శివకుమార్ గౌడ్,సీనియర్ నాయకులు బొమ్మకు రమేష్, మాజీ బ్యాంక్ డైరెక్టర్ బొమ్మకు విశ్వనాథ్, మేడ్చల్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొమ్మకు అజయ్, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీతో పాటు బిజెపి, బీఆర్ఎస్ పార్టీ  నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags: