ఫిబ్రవరి 22 నాడు ఉచిత కంటి వైద్య శిబిరం.

ఫిబ్రవరి 22 నాడు ఉచిత కంటి వైద్య శిబిరం.

విశ్వంభర, చండూర్ :- కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చండూరు మున్సిపాలిటీ, మండలంలోని అన్ని గ్రామాలలో నివసించే ప్రజలకు మరో మారు ఉచిత కంటి వైద్య శిబిరం ఫిబ్రవరి 22 ఆదివారం నాడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు చండూరు మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం నాడు ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభమవుతుందని 50 సంవత్సరాలు వయసు పైబడిన వారు విధిగా ఆధార్ కార్డు తో పాటు ఫోన్ నెంబర్ మరియు వారి వివరాలు అందించాలని, అలాగే కంటి శుక్లాల ఆపరేషన్ అవసరం ఉన్న వారిని హైదరాబాద్ తీసుకెళ్లి ఆపరేషన్ చేయించి తీసుకొచ్చేలా ఫౌండేషన్ చర్యలు తీసుకుంటుందని వారు అన్నారు. ఈ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు.

Tags: