కేటీఆర్ పుట్టినరోజు కానుకగా రేవంత్ సర్కార్ సన్నబియ్యం పంపిన ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్
On
విశ్వంభర, హైదరాబాద్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఆయనకు వినూత్న కానుకను పంపుతున్నట్లు రాష్ట్ర ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ ప్రకటించారు. కేటీఆర్‌కు పుట్టినరోజు బహుమతిగా రేవంత్ సర్కార్ అందిస్తున్న 25 కేజీల సన్నబియ్యాన్ని పంపుతున్నట్లు ఆయన వెల్లడించారు. కేవలం ఈ నెలలోనే కాకుండా, ప్రతి నెలా ఆయనకు సన్నబియ్యం పంపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. ఇటీవల కేటీఆర్ ఒక నిరుపేద కుటుంబం ఇంటికి వెళ్లి, అక్కడ సన్నబియ్యంతో చేసిన భోజనం తిన్నందుకు సాయికుమార్ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.ఒకప్పుడు సామాన్య ప్రజలు సన్నబియ్యంతో వంట చేసుకోవాలంటే కేవలం పండగ రోజుల్లో మాత్రమే సాధ్యమయ్యేదని మెట్టు సాయికుమార్ గుర్తుచేశారు. కానీ నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి పేద ఇంటికీ సన్నబియ్యం అందిస్తూ, ప్రతి రోజూ పండగ వాతావరణాన్ని తీసుకువచ్చిందని కొనియాడారు. దేశంలోనే నిరుపేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని ఆయన గర్వంగా ప్రకటించారు.ఈ సన్నబియ్యం పథకం ఏ ఒక్కరికో పరిమితం కాదని, అన్ని రాజకీయ పార్టీల వారు, ఉన్నవాళ్లు, లేనివాళ్లు అనే తేడా లేకుండా ప్రజలందరూ తినవచ్చని చైర్మన్ పేర్కొన్నారు. నిరుపేద కుటుంబాల కళ్లలో ఆనందం చూడటమే లక్ష్యంగా రేవంత్ సర్కార్ పనిచేస్తోందని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో సాగుతున్న ప్రజా ప్రభుత్వ పథకాల సునామీ దేశంలో మరెక్కడా లేదని, తెలంగాణ సంక్షేమ రంగంలో సరికొత్త చరిత్ర సృష్టిస్తోందని మెట్టు సాయికుమార్ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు
🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mettu-saikumar-chairman-of-fisheries-corporation-sent-sannabiyam-by-revanth/article-19526