ఇనుగుర్తి లో  టీచర్ ట్రైనింగ్ ప్రారంభం

ఇనుగుర్తి లో  టీచర్ ట్రైనింగ్ ప్రారంభం

విశ్వంభర, ఇనుగుర్తి: మండల కేంద్రం ఇనుగుర్తి లోని జిల్లా పరిషత్ హై స్కూల్ లో మండల స్థాయి ఇన్ సర్వీస్ టీచర్స్ ట్రైనింగ్ ఎంఈఓ వెంకటరెడ్డి గురువారం ప్రారంభించారు. అనంతరం ఎంఈఓ మాట్లాడుతూ..విద్యార్థులలో నైపుణ్యాలను పెంపొందించేలా వినూత్న పద్ధతితో బోధించినప్పుడే విద్యార్థుల్లో పాఠ్యాంశంపై ఆసక్తి, విశ్లేషణా సామర్థ్యం పెంపొందుతుందని ఎంఈఓ వెంకట్ రెడ్డి అన్నారు.విద్యా శాఖ  ఏర్పాటు చేసిన 3 రోజుల శిక్షణ సద్వినియోగం చేసుకుని పాఠశాల విద్యార్థులలో ఉన్న లోపాలను సవరించే లా కృషి చేయాలనీ ఉపాధ్యాయులకు సూచించారు. అనంతరం రిసోర్స్ పర్సన్ లు భాస్కర్ రెడ్డి,సారంగపాణి,వేణు, కోటేశ్వర్,బాలరాజులు పలు బోధనాంశాలు,మెలకువలపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో వివిధ పాఠశాలల ఉపాధ్యాయినీ,ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/teacher-training-started-in-inugurthi/article-19555

Tags: