బదిలీపై వెళుతున్న శంషాబాద్ ఇన్‌స్పెక్టర్ నరేందర్ రెడ్డికి ఘన వీడ్కోలు

  • శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఇన్‌స్పెక్టర్ నరేందర్ రెడ్డికి సన్మానం.
  • ప్రజాసేవే ధ్యేయం.. వీడ్కోలు కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్ నరేందర్ రెడ్డి.

Shamshabad News: ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నరేందర్ రెడ్డి బదిలీపై వెళుతున్న సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసు సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానికులు ఆయన సేవలను కొనియాడారు.

ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పరిధిలోని శంషాబాద్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నరేందర్ రెడ్డి బదిలీపై వెళుతున్న నేపథ్యంలో పోలీస్ స్టేషన్‌లో ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ఐలు, కానిస్టేబుళ్లు, హోంగార్డులు, పోలీసు సిబ్బంది పాల్గొని ఆయనకు ఘన సన్మానం చేశారు. శంషాబాద్‌లో విధులు నిర్వహించిన కాలంలో నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణ, ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పడంలో నరేందర్ రెడ్డి విశేష కృషి చేశారని కొనియాడారు. పోలీసు సిబ్బందిని కుటుంబ సభ్యుల్లా భావిస్తూ ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేశారని సహచరులు గుర్తు చేసుకున్నారు. కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు శాలువాలతో సత్కరించి కొత్త బాధ్యతల్లోనూ ఇదే నిబద్ధతతో ప్రజాసేవ కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తనకు సహకరించిన పోలీసు సిబ్బంది, ప్రజలు, మీడియా ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఎక్కడ విధులు నిర్వహించినా ప్రజాసేవే తన లక్ష్యమని పేర్కొన్నారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/farewell-to-shamshabad-inspector-narender-reddy-who-is-going-on/article-19518

Related Posts

Advertisement

LatestNews