రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కాంగ్రెస్ ఆందోళన

విశ్వంభర, రామన్నపేట: నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా ఢిల్లీలో నిరసన తెలుపుతున్న లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అరెస్టును నిరసిస్తూ రామన్నపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో కాంగ్రెస్ నాయకులు శాంతియుత నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పున్న జగన్మోహన్ మాట్లాడుతూ, విద్యార్థుల భవిష్యత్తుతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆరోపించారు. నీట్ పరీక్షల నిర్వహణలో జరిగిన వైఫల్యాలకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులకు మద్దతుగా నిరసన తెలిపిన రాహుల్ గాంధీని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు. కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మొహమ్మద్ జమీరుద్దీన్, డీసీసీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు.

🕒 24 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/congress-protests-against-rahul-gandhis-arrest/article-19545

Tags: