పాలచర్ల లో ఇంటింటికీ వెళ్లి పింఛన్ల పంపిణీ 

విశ్వంభర, రాప్తాడు : రాప్తాడు మండలం పాలచర్ల గ్రామంలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం బుధవారం ఉదయం ఘనంగా నిర్వహించారు. ఉదయం 6 గంటలకే సచివాలయ సిబ్బందితో కలిసి హిందూపురం పార్లమెంట్ అధికార ప్రతినిధి పాలచర్ల ముత్యాలప్ప ఇంటింటికీ వెళ్లి వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తదితర అర్హులైన లబ్ధిదారులకు పింఛన్లను అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సేవ పట్ల లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ముత్యాలప్ప మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నప్పటికీ సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రతి నెలా సమయానికి పింఛన్లను లబ్ధిదారుల ఇంటి వద్దకే అందజేస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వంటి బలహీన వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షుడు గవ్వల నరేష్, మాజీ ఫీల్డ్ అసిస్టెంట్ ఎర్రిస్వామి, బొంత రామ్మోహన్ రెడ్డి, శెట్టిపల్లి మాధవయ్య, ఇండస్ట్రియల్ పవన్, బాల పెద్దలు, సచివాలయ సిబ్బంది,  పాల్గొన్నారు.

🕒 02 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/door-to-door-distribution-of-pensions-in-palachers/article-17600

Tags: