నాగర్‌గూడ నుంచి బీజేపీలో భారీ చేరికలు
- తాళ్ల నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో 150 మందికి పైగా యువత కమలం గూటికి
విశ్వంభర, చేవెళ్ల: చేవెళ్లలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నాగర్‌గూడ గ్రామానికి చెందిన తాళ్ల నవీన్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ చేరికల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సుమారు 100 నుంచి 150 మంది యువకులు, నవీన్ గౌడ్ మిత్రబృందం భారతీయ జనతా పార్టీలో అధికారికంగా చేరారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన రామచంద్ర రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, కేఎస్ రత్నం, ఈటెల రాజేందర్ కొత్తగా పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ దేశ అభివృద్ధి, యువత భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి నాయకత్వంలో బీజేపీ చేస్తున్న సేవలకు ఆకర్షితులై యువత పెద్దఎత్తున పార్టీలో చేరుతున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో చేవెళ్ల నియోజకవర్గంలో బీజేపీ మరింత బలపడుతుందని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు గుండన్నగారి వెంకట్ రెడ్డి, చేవెళ్ల నియోజకవర్గ యువ నాయకులు డాక్టర్ వైభవ్ రెడ్డి పాల్గొని యువతకు పార్టీ సిద్ధాంతాలను వివరించారు. పార్టీలో చేరిన వారిలో విట్టల్ గౌడ్, విజయ్ గౌడ్, వడ్ల మాధవాచారి, సతిని కర్ణాకర్, శివ, పవన్ గౌడ్, వినయ్, నితీష్, సతీష్, ప్రమోద్, వంశీ, శ్రీనివాస్, ఆనంద్ తదితరులు ఉన్నారు. చేవెళ్ల బీజేపీ కార్యాలయంలో జరిగిన ఈ భారీ చేరికల కార్యక్రమంతో నాగర్‌గూడ ప్రాంత రాజకీయాల్లో బీజేపీకి కొత్త ఊపు వచ్చిందని, గ్రామ స్థాయిలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.