మెడ్స్ ఫార్మసీలో గుండెపోటుతో వ్యక్తి మృతి.. సీసీ పుటేజీ వైరల్
ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. కొవిడ్-19 విజృంభించినప్పటి నుంచి హఠాన్మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది.
ఈ మధ్య కాలంలో గుండెపోటు మరణాలు పెరిగిపోయాయి. కొవిడ్-19 విజృంభించినప్పటి నుంచి హఠాన్మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం కొవిడ్ పూర్తిగా తగ్గుముఖం పట్టినప్పటికీ గుండెపోటు మరణాలు మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు. ఎక్కడో ఒక చోట అక్కడికక్కడే కుప్పకూలిపోయి మృతిచెందుతున్నారు.
తాజాగా అలాంటి మరో ఘటన వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్- మేడ్చల్ జిల్లా కీసర గ్రామంలోని మెడ్స్ ఫార్మసీలో ఈ ఘటన జరిగింది. మెడ్స్ ఫార్మసీ నిర్వాహకుడు కస్టమర్లకు మందులను అందించి బిల్లింగ్ చేసే పనిలో నిమగ్నమయ్యాడు. ఆ సమయంలో ఇద్దరు కస్టమర్లు బయట నలబడి ఉండగా లోపల బిల్లింగ్ చేస్తున్న వ్యక్తి ఉన్నట్టుండి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు.
అయితే వెంటనే అక్కడే లోపలే ఉన్న తోటి ఫార్మసీ సిబ్బంది ఒకరు ఫిడ్స్ వచ్చినట్లు భావించి చేతిలో తాళం చెవి పెట్టాడు. సీపీఆర్ చేసే ప్రయత్నం చేయలేదు. దీంతో ఫలితం లేకుండా పోయింది. అప్పటికే ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. దీనికి సంబంధించిన సీసీ ఫుటేజీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సీపీఆర్ చేసి ఉంటే గణక ఆ వ్యక్తి బతికే అవకాశముండేదని పలువురు కామెంట్స్ చేస్తున్నారు. గుండెపోటు బారిన పడకుండా తగు జాగ్రత్తలు అవసరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఆహార నియమాలు పాటించడంతో పాటు రోజూ నడక, కొద్ది సేపు వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని చెబుతున్నారు.
సీసీ ఫుటేజ్.. గుండెపోటుతో వ్యక్తి మృతి
— Telugu Scribe (@TeluguScribe) June 6, 2024
హైదరాబాద్ - మేడ్చల్ జిల్లా కీసర గ్రామంలోని మెడ్స్ ఫార్మసీలో పని చేస్తున్న మురళి, షాపుకు వచ్చిన వారికి మందులు ఇచ్చి.. బిల్లింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయి అక్కడికక్కడే మరణించాడు. pic.twitter.com/5vniumlLRd