కుష్ఠు వ్యాధి అవగాహన కార్యక్రమం
విశ్వంభర, రామన్నపేట: మండల కేంద్రంలోని రామన్నపేట గ్రామ పంచాయతీ వద్ద స్పర్స్ కుష్టు వ్యాధి అవగాహన కార్యక్రమంలో భాగంగా శనివారం గోపాల్ హెచ్.ఈ.ఓ ఆధ్వర్యంలో గ్రామపంచాయతి వద్ద, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో కుష్టు వ్యాధిపై అవగాహన, ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ, కుష్ఠు వ్యాధి మైకో బాక్టీరియమ్ లేప్రే అనే బాక్టీరియాతో వచ్చే అంటూ, ఈ వ్యాధి స్పర్శ లేని, రాగి రంగు, వెంట్రకలు లేని, మెరుస్తున్న మచ్చలు కుష్ఠు వ్యాధి మచ్చలు కావచ్చని, వెంటనే హాస్పిటల్ లో డాక్టర్స్ చూపించి నిర్ధారించుకొవాలని చెప్పారు. గ్రామంలోని ఆశా కార్యకర్తల ద్వారా వైద్యులకీ చూపించాలని తెలిపారు. ఈ వ్యాధిగ్రస్తులను తొందరగా గుర్తించి, తొందరగా చికిత్స అందించడం వలన అంగవైకల్యం రాకుండా చూసుకోగలమని చెప్పారు. ఈ వ్యాధి రకాలను బట్టి 6 నెలలు, 12 నెలల పాటు మందులు పూర్తిగా వాడాలని అన్నారు. 2027 నాటికి కుష్టువ్యాధి రహిత భారత దేశాన్ని తయారుచేయాలని చెప్పారు. తరువాత విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. గ్రామ పంచాయతీలో జరిగిన ఈ కార్యక్రమంలో రామన్నపేట గ్రామ సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఉప-సర్పంచ్ మొటే రమేష్, వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్స్, ప్రజలు పాల్గొన్నారు. బాలికల ఉన్నత పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు, ఏ.ఎన్.ఎం మంజుల, ఆశాలు పాల్గొన్నారు.



