బీజేపీ బూత్ అధ్యక్షుల నియామకం
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, మునిపంపుల గ్రామానికి సంబంధించిన ఎన్నికల బూత్ లకు అధ్యక్షులను శనివారం రామన్నపేట బిజెపి మండల అధ్యక్షుడు బండ మధుకర్ రెడ్డి నియమించారు. 46వ బూత్ కు మామిళ్ళ నరేందర్, 47వ బూత్ కు సద్దల వెంకన్న, 48వ బూత్ కు రావుల నరేష్ లను బూత్ అధ్యక్షులుగా నియమించినట్లు బండ మధుకర్ రెడ్డి తెలిపారు. అనంతరం నూతన బూత్ అధ్యక్షులు మాట్లాడుతూ, రాబోయే రోజులలో మునిపంపుల గ్రామంలో బిజెపి జెండా ఎగరేయడమే లక్ష్యంగా, గ్రామంలో బిజెపి బలోపేతానికి కృషి చేస్తూ ఎంపీటీసీ ఎన్నికలలో బీజేపీ గెలుపు కోసం కృషి చేస్తూ, గ్రామంలో కూడా పార్టీ బలోపేతానికి కృషి చేస్తా మన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు వివరిస్తూ, దేశ అభివృద్ధిలో మునిపంపుల గ్రామము కూడా ఆదర్శవంతంగా ఉండాలని యువతకి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ వనం అంజయ్య, బిజెపి సీనియర్ నాయకులు డోగీపర్తి సుభాష్, కట్ట యాదయ్య, మన్నె పద్మారెడ్డి, జిల్లా యువ మోర్చా కార్యదర్శి అక్కెనపల్లి సైదులు, నీల రాజేష్, ఏలూరి శ్యామ్, మేకల మల్లారెడ్డి, సురువు జాంగిర్, మిరియాల శ్యాంసుందర్, మామిళ్ళ సుధీర్, చింత రమేష్, మిరియాల శ్రీధర్, పోగుల నవీన్, మామిళ్ల జలంధర్, ఆకుల వీరేష్, బోగిని రమేష్, దామరి నాగేష్, కొమ్మిరి ప్రశాంత్, పీట్ల రమేష్ తదితరులు పాల్గొన్నారు.



