చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో కిషన్ రెడ్డి పూజలు 

చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో కిషన్ రెడ్డి పూజలు 

కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాలనికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. కేంద్రంలో మరోసారి ఎన్డీయే కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు.

సార్వత్రికల ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయాలనికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేకపూజలు చేశారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. అమ్మవారి ఆశీస్సులతో కేంద్రంలో మరోసారి ఎన్డీయే కూటమిదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలోనూ బీజేపీ అత్యధిక సీట్లు గెలుచుకోబోతోందని అన్నారు. 

రెండో వారంలో ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టే అవకాశముందన్నారు. తెలంగాణ డబుల్ డిజిట్ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. మోడీ మరోసారి ప్రధాని కావాలని తెలంగాణ ప్రజలు ఆకాంక్షించారని తెలిపారు. పూర్తి ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపు జరగాలన్నారు. ఎగ్జిట్ పోల్స్‌ను మోడీ పోల్స్ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘ఇంకా నయం రీ-ఎగ్జిట్ పోల్స్ చేయాలని డిమాండ్ చేయలేదని ఎద్దేవా చేశారు.

Read More నల్గొండ పై విషం చిమ్ముతున్న బీఆర్ఎస్ - మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

సికింద్రాబాద్ పార్లమెంట్ నుంచి బీజేపీ తరఫున కిషన్‌రెడ్డి బరిలోనిలిచిన సంగతి తెలిసిందే. అదేవిధంగా హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవీలత లాల్ దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. బీజేపీ విజయాన్ని ఆకాంక్షిస్తూ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇదిలా ఉండగా సార్వత్రికల ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కాగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఏపీలో టీడీపీ లీడ్‌లో కొనసాగుతోంది. మరోవైపు లోక్ సభకు సంబంధించి కాంగ్రెస్‌ లీడ్‌లో ఉంది.