ఇథనాల్ పరిశ్రమ కు పర్మిషన్ ఇచ్చిందే కేసిఆర్ : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

ఇథనాల్ పరిశ్రమ కు పర్మిషన్ ఇచ్చిందే కేసిఆర్ : టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

  • అది మాజీ మంత్రి తలసాని కుమారుడిదే
  • ఏ ముఖం పెట్టుకొని రైతులను రెచ్చగొడుతున్నారు 
  • బిఆర్ఎస్ నేతలకు దమ్ముంటే దిలవర్ పూర్ కు రండి 

విశ్వంభర, హైదరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక కార్యక్రమాలు చేయడమే కాకుండా.. రైతులు వ్యతిరేకించే ప్రాజెక్టులు చెపట్టి.. ఇప్పుడు నానా యాగీ చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీ భవన్ లో ఆయన మీడియాతో  మాట్లాడుతూ నిర్మల్ జిల్లా దిలవర్ పూర్ ఇథనాల్ కంపనీ కి అనుమతి 7 జులై 2023 లో టీఆర్ఎస్ హాయంలో వచ్చిందన్నారు. మాజీ మంత్రి శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ డైరెక్టర్ గా ఉన్న కంపనీ కి కేసిఆర్ అనుమతి ఇచ్చాడని తెలిపారు. డిజాస్టర్ రెస్పాన్స్ డిపార్ట్ మెంట్ పర్మిషన్ ఇచ్చింది. ఇథనల్ కంపెనీ అనుమతులు ఇచ్చింది మీ ప్రభుత్వం, ఇప్పుడు అక్కడికి వెళ్లి మీరే ఆందోళన చేస్తు బట్ట కాల్చి మీద వేస్తున్నారన్నారు. రాష్ట్రంలో రైతులను ముంచింది మీరే.. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని రైతులను రెచ్చగొడుతున్నాడన్నారని అన్నారు . ఇథనాల్ కంపెనీ కి ఎలా అనుమతులు ఇచ్చారని దిలవర్ పూర్ రైతులు బిఆర్ఎస్ నేతలను ప్రశ్నించాలని పేర్కొన్నారు. బిఆర్ఎస్ నేతలకు దమ్ముంటే దిలవర్ పూర్ రండి చర్చిద్దామని సవాల్ విసిరారు.

నిర్మల్ ప్రజలు వాస్తవాలను తెలుసుకోవాలని అన్నారు.  బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అక్కడ ఏం చేస్తున్నట్లు  తెలపాలన్నారు. రైతు వ్యతిరేకి ప్రభుత్వం బీజేపీ కి ఓటు వేసింది మీరు కాదా అని బిఆర్ఎస్ నేతలను ప్రశ్నించారు . కంపనీ పెట్టింది టీఆర్ఎస్ నాయకుడు, వాటికీ అన్ని రకాల పర్మిషన్ ఇచ్చింది కేటీఆర్, కేసిఆర్ లు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పై అబండాలు వేస్తున్నారు అని అన్నారు.ఇలాంటి దగుల్ల్బాజీ పనులు టీఆర్ఎస్ నేతలు మానుకోవాలన్నారు. అన్ని పర్మిషన్ లు ఇచ్చి ఇప్పుడు రైతులను రెచ్చగొడుతున్న కేటీఆర్ కి సిగ్గు ఉండాలన్నారు. ఇథనల్ కంపెని పక్క కేటీఆర్ ప్రాజెక్టు అని అన్నారు . రైతులను రెచ్చగొట్టి ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని చెప్పారు. ఇథనల్ కంపనీ విషయంలో పూర్వ పరాలు పరిశీలించి సరైన నిర్ణయం తీసుకుంటాం అని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు .

Read More సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజక వర్గం గుమ్మడవెళ్ళి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల