పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు సభలు, పాదయాత్ర చేపట్టాలని జేఏసీ పిలుపు

విశ్వంభర, హైదరాబాద్: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల సాధన కోసం జూలై 25 నుంచి ఆగస్టు 25 వరకు జిల్లా వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించాలని, ఆగస్టు చివరి వారంలో ఉల్ఫర గ్రామం నుంచి కల్వకుర్తి వరకు పాదయాత్ర చేపట్టాలని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ పిలుపునిచ్చింది. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన విస్తృత రౌండ్ టేబుల్ సమావేశంలో ఈ మేరకు తీర్మానాలు చేసినట్లు జేఏసీ నాయకులు సాయిబాబా, ఎస్.ఎం. ఖలీల్ సంయుక్త ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మహబూబ్‌నగర్ జిల్లాకు రావాల్సిన కృష్ణా, తుంగభద్ర జలాలను పూర్తిస్థాయిలో సాధించడంలో గత బీఆర్ఎస్, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని సమావేశం అభిప్రాయపడింది. దిండి ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాకు చెందాల్సిన నీటిని నల్లగొండ జిల్లాకు మళ్లిస్తున్నారని, దీంతో ఉల్ఫర గ్రామం, ఉల్ఫర తండా ముంపునకు గురవుతున్నాయని పేర్కొన్నారు. ఈ సమస్యపై స్థానికులు 229 రోజులుగా ఆందోళనలు కొనసాగిస్తున్నారని తెలిపారు. దిండి లిఫ్ట్ పథకాన్ని పూర్తిగా రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉల్ఫర గ్రామం నుంచి కల్వకుర్తి వరకు సుమారు 20 కిలోమీటర్ల పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమాలను విజయవంతం చేయడానికి మేధావులు, విద్యార్థులు, రైతులు, కార్మికులు, ప్రజాసంఘాలు పెద్దఎత్తున పాల్గొని సంఘీభావం తెలియజేయాలని జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు.

🕒 21 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/jac-calls-for-assemblies-to-undertake-padayatra-for-implementation-of/article-19210

Tags: