సంత్ సేవాలాల్ జయంతిని  విజయవంతం చేయాలి

సంత్ సేవాలాల్ జయంతిని  విజయవంతం చేయాలి


విశ్వంభర,మిర్యాలగూడ : అల్ ఇండియా బంజారా సేవా సంఘం నియోజకవర్గం అధ్యక్షులు కొర్ర నాగు నాయక్ అధ్యక్షతన  ఈ  నెల 23న  నిర్వహించే సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఉత్సవాలను విజయవంతం చేయాలని మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం   మిర్యాలగూడ నియోజకవర్గం గిరిజన సర్పంచులు, గిరిజన నాయకులతో  మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి  క్యాంప్ కార్యాలయంలో  సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా  ఎమ్మెల్యే బిఎల్ ఆర్  మాట్లాడుతూ  మిర్యాలగూడ నియోజకవర్గంలో నిర్వహించబోయే సేవాలాల్ మహారాజ్  జయంతి వేడుకలు గిరిజనుల ఐక్యతకు నిదర్శనంగా అందరూ కలిసి మెలసి  నిర్వహించాలని   అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో ఉన్న గిరిజన నాయకులు, ఉద్యోగులు, వ్యాపారస్థులు,  కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు..

Tags: