ఎంపీ ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్ 

ఎంపీ ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్ 

విశ్వంభర, హైదరాబాద్:  ఎంపీ ఈటల  రాజేందర్ నివాసానికి ఏసీపీతో సహ పెద్దయెత్తున   పోలీసులు చేరుకున్నారు.  కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఇంటిమీద దాడి  నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు కామారెడ్డి బయలుదేరిన ఈటల రాజేందర్ ను అడ్డుకున్న పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ వైఖరిని, పాలీసుల తీరును  ఈటల రాజేందర్  తీవ్రంగా ఖండించారు. గుండాయిజం చేస్తూ ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.

Tags: