కల్తీ యూరియాని కట్టడి చేయాలి
On
విశ్వంభర, రామన్నపేట: తెలంగాణ ప్రభుత్వం ఫెర్టిలైజర్ యాప్ ద్వారా యూరియాని బుక్ చేసుకోవాలనే నిబంధన పెట్టడం ద్వారా, రైతులకు యూరియా సమయానికి అందకపోవడం మూలంగా యాప్ లో బుక్ చేసి, ప్రైవేట్ ఏజెన్సీలలో తీసుకోవడం వల్ల ప్రైవేట్ ఏజెన్సీ వారు ఏ యూరియా అమ్ముతున్నారో తెలుసుకోలేని పరిస్థితిలో రైతులు ఉన్నారని ఎర్ర రమేష్ వాపోయారు. అటు పంటకు యూరియా వేసే టైం అయిపోతుందని ఎక్కడ దొరికితే అక్కడ తీసుకొని రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వ్యవసాయ అధికారులు రైతులకు సకాలంలో యూరియాని యాప్ ద్వారా కాకుండా వ్యవసాయ సహకార సంఘం ద్వారానే నేరుగా ఇవ్వాలని ఎర్ర రమేష్ డిమాండ్ చేశారు. యూరియా సప్లై చేసే ప్రైవేట్ ఏజెన్సీలని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలని వ్యవసాయ అధికారులను కోరారు.



