వివాదంలో మంత్రి ఉత్తమ్‌కుమార్ దంపతులు, ఎమ్మెల్యే
On
- బక్రీద్ శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టర్లు
- గొర్రె ఉన్న పోస్టర్‌ను పెట్టబోయి… గోవు ఉన్న పోస్టులు
కాంగ్రెస్ మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి దంపతులు, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం బక్రీద్ పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ.. గొర్రె ఉన్న పోస్టర్‌ను పెట్టబోయి… గోవు ఉన్న పోస్టులు పెట్టారు. దీంతో వీరిపై బీజేపీ సీరియస్ అయినట్లు సమాచారం.
అయితే, తమ పొరపాటు తెలుసుకున్న కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియా వేదికగా క్షమాపణలు చెప్పారు. కాగా, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఏకంగా ఓ వీడియోను విడుదల చేశారు. బక్రీద్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ.. తన సోషల్ మీడియా అకౌంట్‌లో పెట్టిన పోస్టర్‌లో జరిగిన పొరపాటుకు ఆయన సారీ చెప్పారు.