భద్రాచల రాములోరి అరుదైన బంగారు తులసీ దళాల విరాళం
విశ్వంభర, భద్రాచలం:- భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆధ్యాత్మిక వైభవానికి ప్రతీకగా నిలిచిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం లో భక్తుల విరాళాల పరంపర రోజు రోజుకు మరింత విస్తరిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు తమ మొక్కులు తీర్చుకుంటూ స్వామివారికి విలువైన కానుకలను సమర్పిస్తున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాస్తవ్యులు శ్రీ కండ్లకుంట శ్రీకాంత్ గారు, శ్రీమతి నీలిమ దంపతులు స్వామివారిపై ఉన్న అపారమైన భక్తి, విశ్వాసాలకు నిదర్శనంగా సుమారు రూ.3 లక్షల విలువ గల రాగిపై బంగారు పూతతోన ప్రత్యేకంగా తయారు చేసిన 108 తులసీ దళాలను దేవస్థానానికి విరాళంగా అందించారు.ఆలయానికి చేరుకున్న దంపతులు ముందుగా పవిత్ర గౌతమీ గోదావరిలో స్నానమాచరించి అనంతరం ఆలయంలో ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాల మధ్య దేవస్థాన అధికారులకు ఈ అరుదైన తులసీ దళాలను సమర్పించారు. స్వామివారి సేవలో తమ వంతు భాగస్వామ్యం కావడం జీవితంలో ఎంతో సంతోషకరమైన ఘట్టమని దాతలు పేర్కొన్నారు. కుటుంబ సభ్యుల సంకల్పంతో ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ తులసీ దళాలను తయారు చేయించామని తెలిపారు.