పుణ్య గౌతమి తీరం భక్తిజ్యోతులతో వెలిగిన గోదావరి హారతి

విశ్వంభర, భద్రాచలం:- శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిగా, దక్షిణ అయోధ్యగా ఖ్యాతి గాంచిన భద్రాచలంలో ప్రవహిస్తున్న పవిత్ర గోదావరి నదికి ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న గోదావరి నదీహారతి కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. పుణ్య గౌతమి తీరం ఆధ్యాత్మిక శోభతో కళకళలాడుతూ, హారతుల వెలుగుల్లో భక్తి పరవశాన్ని పంచుతుండగా, నదీహారతిని కనులారా వీక్షించేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా పురోహితులు రామ వజ్జల రవికుమార్ మాట్లాడుతూ, భద్రాచలం క్షేత్ర మహిమలో గోదావరి నదీహారతికి ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు. పవిత్ర గోదావరి మాతకు సమర్పించే ఈ హారతి కార్యక్రమం భక్తులలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తోందని, ప్రతి ఆదివారం జరిగే ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా భక్తులు మానసిక ప్రశాంతతను పొందుతున్నారని పేర్కొన్నారు.ఆదివారం సాయంత్రం గోదావరి స్నాన ఘట్టాల వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ముందుగా గణపతి పూజలు, వేదమంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తుల చేత దీపోత్సవం జరిపించి, పూజా ద్రవ్యాలతో శ్రీ సీతారామచంద్ర స్వామివారికి, గోదావరి మాతకు అష్టోత్తర శతనామార్చనలు చేశారు. పరాభవ నామ సంవత్సరం వైశాఖ మాసం కృష్ణపక్ష బహుళ అష్టమి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమం భక్తుల్లో ప్రత్యేక భక్తి భావాన్ని నింపింది.ఈ కార్యక్రమంలో పురోహితులు సత్యప్రసాద్ శర్మ, రామాచార్యులు, ఫణికుమార్ శర్మ, తేజశర్మ, కృష్ణశర్మ హారతులు సమర్పించారు. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, స్థానికులు, మహిళలు, యువకులు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

🕒 11 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/punya-gautamis-coast-is-godavari-aarti-lit-with-devotional-lamps/article-15266

Tags: