గిరిజన సమస్యల పరిష్కారమే లక్ష్యం. 

గిరిజన సమస్యల పరిష్కారమే లక్ష్యం. 

  • - ఐటీడీఏ పీఓ బి. రాహుల్

విశ్వంభర, భద్రాచలం:-  తేదీ 11 మే 2026 సోమవారం నాడు భద్రాచలం ఐటిడిఏ కార్యాలయంలో నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి సంబంధిత అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరు కావాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. గిరిజనుల సమస్యలను నేరుగా తెలుసుకొని తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టడం ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు.గిరిజన ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు ఎదుర్కొంటున్న భూ సమస్యలు, ఉపాధి, విద్య, వైద్యం, రేషన్, పెన్షన్, తాగునీరు, రహదారులు, విద్యుత్, గిరిజన సంక్షేమ పథకాల అమలు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులను లిఖితపూర్వకంగా సమర్పించాలని ఆయన సూచించారు. ప్రజలు తమ సమస్యలను స్పష్టంగా వివరించి అవసరమైన పత్రాలను జతచేస్తే సంబంధిత శాఖల ద్వారా త్వరితగతిన పరిష్కారం అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. గిరిజన దర్బార్ కార్యక్రమం ప్రజలకు మరియు అధికారులకు మధ్య సమన్వయ వేదికగా పనిచేస్తుందని, ప్రజల సమస్యలను నేరుగా వినడం ద్వారా పరిపాలన మరింత పారదర్శకంగా మారుతుందని ఆయన అన్నారు. ప్రతి శాఖ అధికారి ఉదయం 10.30 గంటలకు ఐటీడీఏ సమావేశ మందిరంలో తప్పనిసరిగా హాజరై ప్రజల వినతులను స్వీకరించి తక్షణ చర్యలకు శ్రీకారం చుట్టాలని ఆదేశించారు.అలాగే గిరిజనులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావాలని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శించకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని ఐటీడీఏ పీఓ బి. రాహుల్ స్పష్టం చేశారు.

🕒 11 May 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/the-aim-is-to-solve-tribal-problems/article-15264

Tags: