విద్యా వారోత్సవాలు ఘనంగా జరుపుకుందాం..
- డీఈవో సత్యనారాయణమూర్తి.
విశ్వంభర, నెల్లికుదురు:ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ఈనెల నేటి(11) నుండి 17 వరకు జరిగే ప్రత్యేక విద్యా వారోత్సవాలను ఘనంగా జరుపుకుందామని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ.సత్యనారాయణమూర్తి అన్నారు . విద్య వారోత్సవాల్లో భాగంగా నేడు మండల కేంద్రం నెల్లికుదురు కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో అభివృద్ధి పనులకు మానుకోట ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో ఆదివారం సందర్శించారు. కేజీబీవీ లోని నూతనంగా నిర్మించనున్న అడిషనల్ క్లాస్ రూమ్స్ మరుగుదొడ్ల నిర్మాణం కాంపౌండ్ వాల్ తదితర స్థలాలను పరిశీలించారు . ఈ సందర్భంగా డిఇఓ మాట్లాడుతూ వారోత్సవాలు మొదటి రోజు కేజీబీవీ లో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు అనంతరం మండల కేంద్రం నెల్లికుదురు మోడల్ స్కూల్లో వేసవి శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు వారం రోజులపాటు జరిగే ప్రతీ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై విజయవంతం చేయాలని సూచించారు ఎంఎస్.సి సంతోష్, జి.సి.డి.ఓ విజయ కుమారి, ఎస్.ఓ సుమలత, ఎం.ఐ. ఎస్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.