బండకొత్తపల్లి లో మహనీయుల జయంతి 

బండకొత్తపల్లి లో మహనీయుల జయంతి 

విశ్వంభర, గుండాల : గుండాల మండలంలోని ఎంపీపీ ఎస్ బండ కొత్తపల్లి లో మహనీయుల జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా కంచ తిరుపతి  వ్యవహరించారు.  ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, ఏప్రిల్ మాసం ఈ దేశ సంఘసంస్కర్తలు జన్మించిన మాసంగా తెలిపారు. ఫూలే, అంబేడ్కర్, జగ్జీవన్ రావు ల జయంతి నెల ఏప్రిల్ నెల అని తెలిపారు. ఈ దేశానికి అసమానమైనటువంటి సేవలు అందించి తమ జీవితాన్ని ఈ దేశానికి అర్పించినటువంటి మహనీయుల జీవిత క్రమాన్ని విద్యార్థినీ విద్యార్థులకు తెలియజేశారు. ఒక మనిషి భారతీయుడిగా ఎలా జీవించాలో డాక్టర్ అంబేడ్కర్ జీవితాన్ని చదివితే తెలుస్తుందని అన్నారు. నాడు ఫూలే అంబేడ్కర్ కలగన్న సమాజం ఇంకా పరిపూర్ణ స్థాయిలో నిర్మాణం కాలేదని నిర్మాణం చేసుకునే బాధ్యత ఇప్పుడున్న సమాజం మీదే ఆధారపడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుధాకర్ అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ సోమలక్ష్మి ఉపాధ్యాయులు ఉషశ్రీ ప్రియాంక అంగన్వాడీ టీచర్ విక్టోరియా సోమలక్ష్మి లలిత గ్రామస్తులు తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Tags: