19న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష

19న మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష

విశ్వంభర, మహబూబాబాద్: మహబూబాబాద్ మండలం అనంతారం మోడల్ స్కూల్ లో 2026- 27 విద్యా సంవత్సరానికి గాను అడ్మిషన్ పొందడానికి ఆరవ తరగతి నుండి పదవ తరగతి చదవడానికి ఆన్లైన్లో అప్లై చేసిన విద్యార్థులకు ఈనెల 19వ తేదీన ఆదివారం ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ గండి ఉపేందర్ రావు ఒక ప్రకటనలోతెలిపారు.  ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ఆదివారం ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు, ఏడవ తరగతి నుండి పదవ తరగతి వరకు మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకు ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. హాల్ టికెట్లను telanganams.cgg.gov.in వెబ్ సైట్ నుండి డౌన్లోడ్ చేసు చేసుకోవచ్చని తెలిపారు. పరీక్షకు విద్యార్థులు హాల్ టికెట్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు లాంటిది వెంట తీసుకురావాలని సూచించారు.

Tags: