ఒకే మొబైల్ నెంబర్ అనుసంధానం చేసుకోవాలి
విశ్వంభర, చింతపల్లి: ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలకు రైతులు రైతు భరోసా, ఫార్మర్స్ రిజిస్ట్రీ ,ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌లలో ఒకే మొబైల్ నెంబర్‌ను నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ శాఖ అధికారిని శ్రావణ కుమారి సోమవారం ఒక ప్రకటన తెలిపారు. ప్రభుత్వ పథకాలు , ఎరువుల కొనుగోలు ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ మూడు విభాగాల్లో వేర్వేరు నెంబర్లు ఉన్నట్లయితే, భవిష్యత్తులో ఎరువుల బుకింగ్ సమయంలో సాంకేతిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని ఆమె రైతులకు హెచ్చరించారు. ఒకవేళ నెంబర్లు వేర్వేరుగా ఉన్నా లేదా పాత నంబర్ అందుబాటులో లేకపోయినా, వెంటనే సంబంధిత అగ్రికల్చరల్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్లను (ఏఈఓ) సంప్రదించి ఒకే నంబర్ ఉండేలా అప్‌డేట్ చేయించుకోవాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. రైతులకు ప్రభుత్వ లబ్ధి నేరుగా, వేగంగా అందుతుందని ఆమె వివరించారు.



