ఇంటర్మీడియట్ విద్యార్థులకు సన్మానం 

ఇంటర్మీడియట్ విద్యార్థులకు సన్మానం 

విశ్వంభర, గుండాల : బండకోతపల్లి గ్రామంలో ఇంటర్మీడియట్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థుల కృషి, పట్టుదల, క్రమశిక్షణను ప్రశంసిస్తూ, భవిష్యత్తులో ఇంకా ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గద్వాల ఉపేందర్ నాయుడు ముఖ్య అతిథిగా హాజరై, ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు తెలియజేసి, శాలువాలు మరియు ప్రశంసాపత్రాలు అందజేసి సన్మానించారు. విద్యార్థులు ఉన్నత విద్యలో రాణించి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గోపాలదాస్ యాదగిరి , వార్డు సభ్యులు గోపాలదాస్ రాములు , యాకమ్మ-సుధాకర్ , బూర్గుల నర్సయ్య , శాంతమ్మ , ఉష-ఉపేందర్  మరియు గ్రామస్థులు, యువకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags: