సంతోషం నింపుతున్న ఇందిరమ్మ ఇండ్లు

సంతోషం నింపుతున్న ఇందిరమ్మ ఇండ్లు

విశ్వంభర, నెల్లికుదురు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లతో పేదల ముఖాల్లో సంతోషాన్ని నింపుతోందని డిసిసి అధ్యక్షురాలు డా.భూక్య ఉమా మురళి నాయక్ అన్నారు. మండలంలోని బంజర గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు గృహప్రవేశానికి ఆమె సోమవారం మాజీ డిసిసి అధ్యక్షులు భరత్ చంద్ర రెడ్డి తో కలిసి గృహప్రవేశ క్రతవు ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడానికి సన్నబియ్యం, గృహావసరాలకు ఫ్రీగా విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం,జీరో వడ్డీ రుణాలు,రైతులకు రుణమాఫీ,పంటలకు బోనస్ తదితర పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. త్వరలోనే రెండవ విడత ఇందిరమ్మ ఇండ్లు లబ్ధి దారుల ఎంపిక ప్రారంభమవుతుందని చెప్పారు. అర్హులందరికీ ఇండ్లు ఇచ్చేదాకా ప్రభుత్వం ఊరుకోదని తెలిపారు.ప్రజా పాలనకు బాటలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికలలో సంపూర్ణ మద్దతు తెలిపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బాలకృష్ణ పార్టీ మండల అధ్యక్షులు గొల్లపల్లి ప్రభాకర్ గౌడ్,సత్యపాల్ రెడ్డి,బాలాజీ,ఆకుతోట సతీష్,అనిల్,తుప్పతూరి రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Tags: