బస్సు షెల్టర్ల దుస్థితిపై ‘ఆప్’ వినతి

బస్సు షెల్టర్ల దుస్థితిపై ‘ఆప్’ వినతి

విశ్వంభర, హైదరాబాదు : నగరంలో బస్సు షెల్టర్ల అధ్వాన్న పరిస్థితిపై ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు టీజీఎస్‌ఆర్‌టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. హేమ జిల్లోజు, బుర్ర రాము గౌడ్ నాయకత్వంలో బస్ భవన్‌లో జరిగిన ఈ సమావేశంలో షెల్టర్ల ఆధునీకరణ అవసరాన్ని వివరించారు. షెల్టర్ల నిర్వహణ ప్రధానంగా జిహెచ్ఎంసి పరిధిలోనిదని ఎండీ తెలిపారు. శాఖల మధ్య సమన్వయ లోపంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీ ఆసుపత్రి వద్ద తక్షణమే షెల్టర్ ఏర్పాటు చేయాలని, ప్రతి షెల్టర్ వద్ద రూట్ మ్యాప్ బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డిమాండ్లు నెరవేర్చకపోతే ఈ నెల 20న నిరసన చేపడతామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జావిద్ షరీఫ్, దర్శనం రమేష్, కొడంగల్ శ్రీనివాస్, రాకేష్ రెడ్డి, అజీమ్ మౌలాలి, ఇస్మాయిల్, ఆదాం, జై సింగ్ జాదవ్, ఎస్ఎన్ రెడ్డి పాల్గొన్నారు.

Tags: