సీసీ రోడ్డు పనులు ప్రారంభం
విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల్ కేంద్రంలోని 8వ వార్డు నెంబర్మెంబర్ కాకి పరమేష్, గ్రామ సర్పంచ్ నవీన్ పాలకవర్గంతో 8వ వార్డులో సిసి రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సీసీ రోడ్డు కాకి కుమార్ ఇంటి నుండి సురేందర్ రెడ్డి ఇంటి వరకు 6 లక్షల హెచ్ ఎం డి ఏ నిధులతో నిర్మాణ పనులు మొదలుపెట్టడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, గ్రామంలో ప్రతి వార్డులో సిసి రోడ్డు పనులు అలాగే అండర్ డ్రైనేజ్ విద్యుత్ పనులు పెండింగ్లో ఉంన్నాయని, ప్రతి వార్డులో వార్డు మెంబర్స్ అందరూ తమ తమ వార్డులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమములో గ్రామ సర్పంచ్ మునగపాటి నవీన్ ఉప సర్పంచ్ శ్రీ జొరల రమేశ్ , వార్డు మెంబర్స్ కాకి పరమేష్, తింగిరికారి బేబీ, పోల్కం సునీత, ఆవులకాడి కిష్టామ్మ, స్వర్ణగంటి సంజీవ, మహమ్మద్ ఆజం, కడమోని స్వాతి, వత్తుల శాలిని, దిద్దెల శ్రీశైలం, ఆకుల వీరిబాబు, సున్నం స్వప్నా, జటావత్ రుకేష్, రెవెళ్ళ చంద్రమౌళి, శివగంగ ఆలయ కమిటీ ఛైర్మన్ అల్లే కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కాకి ఈశ్వర్ ముదిరాజ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ అల్లే బిక్షపతి పంచాయతి కార్యదర్శి సుజాత, గ్రామ పంచాయతి సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.



