ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కాలని పాదయాత్ర'

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కాలని పాదయాత్ర'

విశ్వంభర, చండూరు:-మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి రాష్ట్ర మంత్రివర్గంలో చోటు దక్కాలని కాంక్షిస్తూ, ఆయన వీరాభిమాని, నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన ముష్టిపల్లి లింగస్వామి చేపట్టిన పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. ముష్టిపల్లి గ్రామం నుండి నల్గొండ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర దేవస్థానం వరకు ఈ యాత్ర సాగుతోంది.లింగస్వామి చేపట్టిన ఈ పాదయాత్ర సోమవారం నాటికి నాలుగో రోజుకు చేరుకుంది. చండూరు మండల కేంద్రానికి చేరుకున్న యాత్రకు స్థానిక మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కోడి వెంకన్న  ఘన స్వాగతం పలికి, తన సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజగోపాల్ రెడ్డి  సేవలను గుర్తించి అధిష్టానం ఆయనకు తగిన గుర్తింపు ఇవ్వాలని ఆకాంక్షించారు.రాజగోపాల్ రెడ్డి కి మంత్రి పదవి ఇచ్చేలా కాంగ్రెస్ అధిష్టానం మనసు మారాలని కోరుతూ.. లింగస్వామి చెరువుగట్టు గుట్టపైకి మోకాళ్ల ద్వారా వెళ్లి స్వామివారిని దర్శించుకోనున్నారు. తన నాయకుడిపై ఉన్న అచంచలమైన అభిమానంతో ఆయన ఈ కఠినమైన మొక్కును చెల్లించుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో లతీఫ్ పాషా, సరికొండ వెంకన్న, మహమ్మద్ జానీ, యాదగిరి మరియు పలువురు మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కాలని నియోజకవర్గ వ్యాప్తంగా ఆయన అనుచరులు, అభిమానులు ఇలాంటి వినూత్న కార్యక్రమాలతో తమ మద్దతును తెలుపుతున్నారు.
 
 
 
 
 
 

Tags:  

Advertisement

LatestNews

ఘనంగా శోభన్ బాబు సేవా సమితి ఆధ్వర్యంలో చలివేంద్రం ప్రారంభం.
ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి దక్కాలని పాదయాత్ర'
సీఎం రేవంత్ కు  బహిరంగ లేఖ రాసిన  CPI ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం 
ప్రీ ,ప్రైమరీ విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్లు పంపిణీ .- ప్రిన్సిపాల్ పురం భూపాల్ రెడ్డి .
పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలి . -  హాజరైన వివిధ శాఖల ఉద్యోగస్తులు .
సంగారెడ్డి లో బీసీ గర్ల్స్ హాస్టల్ భవనాన్ని పరిశీలించిన జగ్గారెడ్డి
ఇంటర్ ఫలితాల్లో ‘హయత్​నగర్​ మైనారిటీ రెసిడెన్షియల్’ విద్యార్థినులు ప్రతిభ