రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలి
విశ్వంభర, చింతపల్లి : ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా సోమవారం నసర్లపల్లి గ్రామంలో సర్పంచ్ పంబలి మాలతి వెంకటయ్య అధ్యక్షతన రోడ్డు భద్రత పై అవగాహన సభ నిర్వహించారు. గ్రామ స్థాయిలో సర్పంచ్ నేతృత్వంలో 9 మందితో కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాంపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజు హాజరై మాట్లాడుతూ, ప్రతి పౌరుడు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టు కోవాలని, ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడుపకూడదని, రోడ్డు రవాణా రూల్స్ ప్రకారం నడుచుకోవాలన్నారు. తెరిచి వున్న బావులను పూడ్చడం, మూయడం, రోడ్లకు ఇరువైపులా ఉన్న ముళ్ల పొదలను తొలగించడం మొదలైనవి రోడ్డు భద్రత ప్రమాణాలలో భాగం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సై ముత్యాల రామూర్తి, పంచాయతీ కార్యదర్శి వినోద్ రెడ్డి, ఉప సర్పంచ్ వడ్లకొండ నర్సింహా, వార్డు సభ్యులు నక్క సంపూర్ణ శివ, నల్ల అనూష యాదగిరి, గ్రామ శాఖ అధ్యక్షులు దాసరి రాజు, మాజీ వైస్ ఎంపీపీ పల్లా శ్రీనివాస్ రెడ్డి, విశ్రాంతి ఉపాధ్యాయులు పున్రెడ్డి విష్ణు వర్ధన్ రెడ్డి, వడ్లకొండ రాములు, విలేజ్ పోలీస్ ప్రసాద్, ఉపాధ్యాయులు రామకృష్ణ, అఖిమ్, అంగన్వాడీ టీచర్లు వడ్లకొండ యాదమ్మ, దార భారతి, ఆశ వర్కర్లు తిరుగుల్ల పుష్పలత, నల్ల చంద్రకళ, మేకల వెంకటయ్య, బొడ్డుపల్లి పరమేష్, వడ్లకొండ వెంకటయ్య, వలబోతు ఆదినారాయణ, షేక్ అబ్బాస్, రషీద్, గౌస్, బీరెల్లి మహేష్, కొడిదాల కిరణ్, బర్ల యాదయ్య, నల్ల కాశయ్య, రాజు శ్రీశైలం, రాములు గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.



