కలెక్టరేట్ లో ప్రజావాణి
విశ్వంభర, మహబూబాబాద్: సోమావారం కలెక్టరేట్ లోని ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులతో కలిసి ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా మరిపెడ మండలం లునావత్ తండా కు చెందిన లునావత్ సురేష్ తనకు సాంకేతిక కారణాలతో ఇప్పటి వరకు రుణమాఫీ కాలేదని అధికారులు పరిశీలించి రుణమాఫీ చేయగలరని కోరారు. జిల్లా కలెక్టరేట్ లోని గార్డెన్ లో తోటమాలిగా విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తాము కొత్తగా జిల్లా ఏర్పాటైన దగ్గరి నుండి తోటమాలి పని చేసుకుంటూ జీవనాధారం చేసుకుంటున్నామని, కాంట్రాక్టర్ ద్వారా మాకు బిల్లులు రావట్లేవని తమను మునిసిపాలిటీలో చేర్పించి ఉపాధి కల్పించాలని కోరారు. ఇనుగుర్తి మండలం రెండు పడక గదుల నిర్మాణ లభిదారులు తమ గ్రామానికి మంజూరి అయిన రెండు పడక గదుల నిర్మాణానికి సంబందించిన బిల్లులు ఇప్పించగలరని కోరారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 171 దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు సత్వర పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.



