అంబేద్కర్ విగ్రహ శుద్ధి
On
విశ్వంభర, కేసముద్రం: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని కేసముద్రం మండల భారతీయ జనతా పార్టీ (బిజెపి) అధ్యక్షులు ఉప్పునుతల రమేష్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ఘనంగా నివాళులర్పించారు. బిజెపి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహాన్ని పార్టీ నాయకులు, కార్యకర్తలు నీటితో శుద్ధి చేసి, పూలమాలలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన దీపాంజలి కార్యక్రమంలో విగ్రహం వద్ద కొవ్వొత్తులు వెలిగించి బాబాసాహెబ్‌కు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పొదిల నరసింహారెడ్డి, మండల నాయకులు లెంకలపెల్లి శ్రీనివాస్ , వెలిశాల్ సవీన్ సింగంశెట్టి మధుకర్ , బెజ్జం సురేష్ మండల బీజేపీ ముఖ్య నాయకులు, శక్తి కేంద్రాల ఇంచార్జ్ లు, మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.



