రహదారి ప్రమాదాల పై అప్రమత్తంగా ఉండాలి
విశ్వాంభర, పెద్ద శంకరంపేట: రహదారి ప్రమాదాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా సివిల్ సప్లై డిఎం పీఠ మండల ప్రత్యేక అధికారి జగదీష్ అల్లాదుర్గం సిఐ రేణుక రెడ్డిలు అన్నారు. సోమవారం పెద్ద శంకరంపేట లోని రైతు వేదికలో ఏర్పాటుచేసిన రహదారి నిబంధనల అవగాహన సదస్సులో పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరు రహదారి నిబంధనలు తప్పనిసరిగా పాటించాలన్నారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని.. వాహనాలకు సంబంధించిన ధ్రువపత్రాలు కలిగి ఉండాలని వారు వివరించారు. అనంతరం పెద్ద శంకరంపేటలోని పలు రహదారులపై ఏర్పడిన గుంతలను పూడ్చారు. ఈ కార్యక్రమంలో పేట సర్పంచ్ జంగం రేణుక .ఎస్సై ప్రవీణ్ రెడ్డి. ఎంఈఓ శేఖర్. రిటైర్డ్ ఎంఈఓ వెంకటేశం. ఈవో వెంకట రాములు తదితరులు పాల్గొన్నారు. ఆయా గ్రామాలలో తాసిల్దార్ ప్రభుదాస్ ఎంపీడీవో క్రాంతికుమార్ ఆయా శాఖల అధికారులు రహదారి నిబంధన పై ప్రజలకు అవగాహన కల్పించారు.



