ఉపాధ్యాయులకు సన్మానం
On
విశ్వంభర, పెద్ద శంకరంపేట : పాఠశాల నుండి ఇటీవల బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు పూర్వ పాఠశాలలో విద్యార్థులు సోమవారం ఘనంగా సన్మానించారు. మండల పరిధిలోని మల్కాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో పనిచేసిన ప్రధానోపాధ్యాయులు ప్రసూన శేఖర్ గౌడ్, శ్రీనివాస్, పాండురంగం, కిషోర్ లకు సన్మానించారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు విటల్ మాట్లాడుతూ చేసిన సేవలే ఉపాధ్యాయులకు గుర్తింపునిస్తాయని ఈ పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయులకు విద్యార్థులు సన్మానం చేస్తున్నారంటే ఈ ఉపాధ్యాయులు ఎలా విద్యా బోధన చేశారో అర్థం అవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సుష్మ, ఉపాధ్యాయులు స్రవంతి, ఆనంద్, సుదీర్, ప్రవీణ్, కాశీరాం తదితరులు ఉన్నారు.