హుస్నాబాద్ లో ఫుడ్ కోర్ట్ ను ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్
విశ్వంభర, హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లోని అక్కన్నపేట రోడ్డులోని ఏనె సమీపంలో సోమవారం నూతనంగా ఏర్పాటు చేసిన లక్ష్మీ గణపతి ఫుడ్ కోర్ట్ ను మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా యజమాన్యానికి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ, నాణ్యతతో కూడిన ఆహార పదార్థాలను వినియోగదాలకు అందించాలని సూచించారు. ఆహార పదార్థాల తయారీలో శుభ్రత పాటించాలన్నారు. వినియోగదారులకు నాణ్యమైన, స్వచ్ఛమైన ఆహార పదార్థాలను అందించాలన్నారు. అభివృద్ధి చెందుతున్న హుస్నాబాద్ ప్రాంతంలో వినియోగదారులకు అందుబాటులో నూతనంగా ఫుడ్ కోర్ట్ ను ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పాటు చేసిన హోటల్ వినియోగదారుల మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా హోటల్ యాజమాన్యానికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.. ఫుడ్ కోర్ట్ ఏర్పడిన సందర్భంగా హోటల్ ప్రాంగణంలో నాయకులు కార్యకర్తలతో సందడి నెలకొంది.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, మున్సిపల్ వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు వెల్దండి వెంకటరమణ, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వెన్నరాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంక చందు, తదితరులు పాల్గొన్నారు.